DSports 9 Dec:మెల్‌బోర్న్: వెస్టిండీస్ పవర్-హిట్టర్, స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌లలో ఆడుతున్న రస్సెల్, చరిత్రలో 10,000 పరుగులు, 400 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఈ ఘనతతో టీ20 ఫార్మాట్‌లో రస్సెల్ తిరుగులేని ఆల్‌రౌండర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.