
DET:JAN 06:
పాత స్కిట్ మరియు వివాదం:
చాలా ఏళ్ల క్రితం ఒక టీవీ షోలో భాగంగా అనసూయ,నటి రాశి గురించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో ఈ విషయం పెద్దగా చర్చకు రాకపోయినా ఇటీవల సోషల్ మీడియాలో ఆ పాత వీడియో మళ్ళీ వైరల్ అయ్యింది.దీనిపై నెటిజన్లు అనసూయను విమర్శించడమే కాకుండా రాశి అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేశారు.
అనసూయ వివరణ మరియు క్షమాపణ:
ఈ వివాదంపై అనసూయ సానుకూలంగా స్పందించారు.ఆ సమయంలో అవగాహన లేకనో లేదా స్క్రిప్ట్ డిమాండ్ మేరకో అలా మాట్లాడి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.నేను గతంలో చేసిన తప్పును ఇప్పుడు వెనక్కి వెళ్లి సరిదిద్దలేను .కానీ ఆ మాటల వల్ల రాశి గారు బాధపడి ఉంటే నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను అని ఆమె పేర్కొన్నారు.
రాశి పట్ల గౌరవం:
తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవని రాశి అంటే తనకు ఎంతో గౌరవం ఉందని అనసూయ స్పష్టం చేశారు.అప్పట్లో చిన్న వయస్సులో తెలియక చేసిన పొరపాట్లను ఇప్పుడు భూతద్దంలో చూడవద్దని ఆమె కోరారు.ఎదుటివారిని కించపరచడం తన ఉద్దేశ్యం కాదని ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు.
