
D NEWS: ఆమనగల్లు పట్టణంలోని చిరువ్యాపారులకు న్యాయం జరిగేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే హామీతో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసును చిరువ్యాపారులు ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు.
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగిందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవ్వారి శివలింగం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో స్పష్టమైన హామీ లేకపోవడంతో కేసు కొనసాగిందని వారు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చిరువ్యాపారులతో సమావేశమై నిర్మాణంపై హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో వ్యాపారులు కలిసి కోర్టు కేసును ఉపసంహరించుకున్నారని చెప్పారు.
అతి త్వరలోనే ఎమ్మెల్యే చేతుల మీదుగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో ఆమనగల్లులో ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఆరోపణలు చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
