
DET:DEC 11:
గ్లోబల్ స్థాయిలో అలియా గౌరవం:
బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక రెడ్ సీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం లో ఆమెకు గోల్డెన్ గ్లోబ్ హారిజన్ అవార్డు లభించింది.ఈ అవార్డును గెలుచుకున్న భారతీయ నటిగా అలియా నిలిచింది.ఈ గౌరవం ఆమె నటనకు,సినిమా రంగంలో ఆమె చేసిన కృషికి అంతర్జాతీయ గుర్తింపుగా భావించవచ్చు.
సినీ ప్రయాణాన్ని గుర్తుచేస్తూ:
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్లో అలియా భట్‌కు అవార్డు ఇవ్వడమే కాకుండా ఆమె సినీ కెరీర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు.ఈ విభాగంలో అలియా పోషించిన ముఖ్యమైన పాత్రలను ఆమె నటనా పరిణామాన్ని గుర్తు చేసుకున్నారు.స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ప్రారంభించి గంగూబాయి కతియావాడి,రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ వంటి చిత్రాల వరకు ఆమె ప్రయాణాన్ని చూపించారు. అలియా భట్ భవిష్యత్తులో చేయబోయే అంతర్జాతీయ ప్రాజెక్టుల గురించి కూడా చర్చ జరిగింది.
రెడ్ కార్పెట్‌పై మెరిసిన అలియా:
ఈ అవార్డు వేడుక సందర్భంగా అలియా భట్ రెడ్ కార్పెట్‌పై తన అందచందాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.ఆమె స్టైలిష్ లుక్స్ ఫ్యాషన్ సెన్స్ ఫెస్టివల్‌కు హాజరైన వారిని ఎంతగానో ఆకట్టుకుంది.ఈ వేదికపై కేవలం అలియా భట్టే కాకుండా ట్యూనీషియా నటి హేండ్ సబ్రీ కూడా ఒమర్ షరీఫ్ అవార్డు అందుకున్నారు.హాలీవుడ్ నుండి కూడా పలువురు ప్రముఖ దర్శకులు నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు.
అంతర్జాతీయంగా భారతీయ సినిమా ఖ్యాతి:
అలియా భట్‌కు గోల్డెన్ గ్లోబ్ హారిజన్ అవార్డు దక్కడం అనేది భారతీయ సినిమాకు ముఖ్యంగా మహిళా నటీమణులకు గ్లోబల్ స్థాయిలో లభిస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుంది.అలియా బాలీవుడ్లో ఇప్పటికే స్టార్ డమ్‌ను సంపాదించుకుంది,ఇప్పుడు ఈ అంతర్జాతీయ గౌరవం ఆమె కెరీర్‌కు మరింత బలాన్ని చేకూర్చింది.భవిష్యత్తులో భారతీయ సినిమా మరిన్ని అంతర్జాతీయ వేదికలపై వెలగడానికి ఇది ఒక మంచి పరిణామంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
