
DET:DEC 03:
అఖండ 2 టికెట్ ధర పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం అఖండ 2 తాండవం విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర యూనిట్‌కు శుభవార్త అందించింది. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు GO జారీ చేసింది.
పెరిగిన ధరలు, ఎంత పెంచారంటే..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అఖండ 2 సినిమాకు పెరిగిన ధరలు విడుదలైన తేదీ నుంచి పది రోజుల పాటు అమలులో ఉంటాయి.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ.75 పెంచుకోవచ్చు.మల్టీప్లెక్స్‌లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ.100 పెంచుకునేందుకు అనుమతి లభించింది.ముఖ్యంగా రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ టికెట్ ధరల పెంపుతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ వసూళ్లు దక్కే అవకాశం ఉంది.
డిసెంబర్ 4న గ్రాండ్ ప్రీమియర్ షో!
అఖండ 2 సినిమాను డిసెంబర్ 5న అధికారికంగా విడుదల చేయనున్నారు. అయితే, దాని కంటే ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.ప్రీమియర్ షో సమయం డిసెంబర్ 4 రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఈ ప్రత్యేక షోను వేయవచ్చు.ప్రీమియర్ షో టికెట్ ధర ఈ స్పెషల్ షో కోసం టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించారు.ఈ గ్రాండ్ ప్రీమియర్ షోల కోసం టికెట్ బుకింగ్స్ ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ప్రారంభమయ్యాయి. ఫ్యాన్స్ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే, బాలయ్య సినిమాకు మొదటి రోజు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తోంది.
అభిమానుల్లో భారీ అంచనాలు:
2021లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2 తాండవం పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బాలకృష్ణకు, దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఉన్న సక్సెస్ కాంబినేషన్ కారణంగా ఈ సినిమా అఖండకు మించిన విజయాన్ని సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ టికెట్ ధరల పెంపు నిర్ణయం ఈ అంచనాలను మరింత పెంచింది.
