లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ అధికారి అనురాగ్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అనురాగ్‌పై లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వేర్‌హౌస్‌లకు సబ్సిడీ నిధులు విడుదల చేసేందుకు డబ్బులు అడిగినట్లు ఫిర్యాదులు అందాయి.
శివాయ్ వేర్‌హౌస్ యాజమాన్యం నుంచి రూ.1 లక్ష, శ్రీకృష్ణ వేర్‌హౌస్ నుంచి రూ.60 వేలు అనురాగ్ డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అనురాగ్‌ను సస్పెండ్ చేస్తూ శాఖ నిర్ణయం తీసుకుంది.