Agadha OTT Release: Recent Divine Blockbuster to Stream on ZEE5 from September 25

D News: థియేటర్లలో మంచి స్పందన అందుకున్న డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్లతో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా..

ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ‘అగధ’ సస్పెన్స్, మిస్టరీ, డివైన్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి పాత్రలతో పాటు ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఎంఎస్ రాజు తెరకెక్కించిన విధానం, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ అందించగా.. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. రాకేష్ వెంకటాపురం సంగీతం అందించారు. ఇప్పుడు థియేటర్లలో సినిమా మిస్ అయిన ప్రేక్షకులతో పాటు మరోసారి చూడాలనుకునే వారికి జీ5 ద్వారా ‘అగధ’ అందుబాటులోకి రానుంది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana