
DNews: Jan7: గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి.. పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “సముద్రంలో కలిసే నీటిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. నీటిపై రాజకీయాలు చేయవద్దని తెలంగాణను అభ్యర్థిస్తున్నాను. రాజకీయ నాయకులు పోటీగా మాట్లాడుకోవడం సరికాదు. అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలి. తెలుగు దేశం ఒక్కటే.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగి ఒకరినొకరు ఆనందించే పరిస్థితి ఉండకూడదు. భావోద్వేగాలతో ఆటలు ఆడటం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేయడం మంచిది. ఆర్టీఎస్ లో నీళ్లు రాకపోతే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్ నగర్ కు ఇచ్చాం. దేవాదుల, కల్వకుర్తి, నేనే దాన్ని ప్రారంభించాను. దేవాదులను ముందుకు తీసుకెళ్లండి.. ఎవరు వద్దు అన్నారు ?
