
విశాఖపట్నం సినీ ప్రేక్షకులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్ అందించారు. నగరంలో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ‘ఏఏఏ సినిమాస్’ (AAA Cinemas) గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆకట్టుకునే ఇంటీరియర్స్, అద్భుతమైన విజువల్స్, క్లియర్ సౌండ్ క్వాలిటీతో ఈ మల్టీప్లెక్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
మొత్తం 8 స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం 1, 2, 3, 4, 5, 6, 8వ స్క్రీన్లు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే 7వ స్క్రీన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంతకీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్క్రీన్ల ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
స్క్రీన్ 1 (VIP స్క్రీన్):
అత్యంత లగ్జరీ సీటింగ్, ప్రత్యేకమైన VIP సదుపాయాలతో ప్రేక్షకులకు ప్రీమియం సినిమా అనుభూతిని అందిస్తుంది.
స్క్రీన్ 8 (లౌంజ్ స్క్రీన్):
ప్రశాంతమైన, రిలాక్స్‌డ్ వాతావరణంలో సినిమా చూడాలనుకునే వారికి ఈ స్క్రీన్ మంచి ఎంపికగా నిలుస్తోంది.
థియేటర్‌లో పిక్చర్ క్వాలిటీ, ఆడియో ఎంతో కీలకం. ఈ విషయంలో AAA Cinemas ఎలాంటి రాజీ పడలేదు. అన్ని స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ‘బార్కో SP4K సిరీస్’ (Barco SP4K Series) ప్రొజెక్టర్లను ఏర్పాటు చేశారు.
స్క్రీన్ 1, 3, 5, 6లలో శక్తివంతమైన డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. స్క్రీన్ 2, 4, 8లలో డాల్బీ 7.1 (Dolby 7.1) సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇతర స్క్రీన్లలో JBL స్పీకర్లను వినియోగించగా.. స్క్రీన్ 5లో మాత్రం ప్రీమియం డాల్బీ స్పీకర్లను అమర్చడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
స్క్రీన్ 5 ప్రత్యేకత:
సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న స్క్రీన్లలో స్క్రీన్ 5 ఒకటి. విశాఖలోని అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా నిలిచిన దీనికి 57 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తు ఉంది. Barco SP4K-55B ప్రొజెక్టర్‌తో అందించే హైక్వాలిటీ విజువల్స్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నాయి.
స్క్రీన్ 7పై భారీ అంచనాలు:
ప్రస్తుతం ఏడు స్క్రీన్లలో సినిమాల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అయితే మూవీ లవర్స్ అంతా ఇప్పుడు 7వ స్క్రీన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం.. ఇండియాలోనే తొలిసారిగా ఆకర్షణీయమైన ‘Qluxon’ (Q-Luxon) LED ప్రొజెక్షన్ స్క్రీన్‌ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు చెబుతుండటమే.
మొత్తంగా చూస్తే.. విశాఖ నగరంలో ప్రీమియం థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను కోరుకునే సినీ అభిమానులకు AAA Cinemas ఒక ప్రత్యేకమైన వన్-స్టాప్ డెస్టినేషన్‌గా మారుతోంది.
