
DNews: Feb 07: సిద్ధిపేట జిల్లా దుల్మిట్ట మండలంలోని కూటిగల్, భైరంపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపింది. మద్దూరు మండలంలోని లాధ్నూర్, అమ్మాపూర్ గ్రామాల్లో పులి దాడి చేసి గర్భస్థ దూడలను చంపడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు పులి అడుగుజాడలను పరిశీలించి, అది యాదాద్రి జిల్లా నుంచి సిద్ధిపేటలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. దుల్మిట్ట, మద్దూరు మండలాల ప్రజలు, రైతులు సాయంత్రం సమయంలో బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం పులి అడుగుజాడల ఆధారంగా దాని కదలికలను గుర్తించేందుకు అటవీ అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
