DNews: Mar 02: వికారాబాద్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల తుది శిక్షణా సమావేశంలో రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడినందుకు తనపై కేసులు నమోదయ్యాయని, ఆదివారం కూడా కోర్టుకు వెళ్లిన విషయాన్ని చెప్పారు. గత 19 ఏళ్లలో జెడ్పీటీసీ నుండి ఎమ్మెల్యేగా, పార్టీ పదవులు చేపట్టి, చివరికి ముఖ్యమంత్రిగా ఎదిగిన అనుభవాన్ని వివరించారు. తనపై అనేక కేసులు, అపకీర్తి దావాలు కూడా నమోదయ్యాయని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోనియా గాంధీ పేరు కీలకమైందని, రాహుల్ గాంధీ ఐదు సంవత్సరాల పోరాటం ద్వారా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదిగారని చెప్పారు. దేశానికి, ప్రజలకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీ దేశంలోని అనేక సమస్యలపై పోరాడిన విషయాన్ని కూడా గుర్తుచేశారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana