
DNews: Fab 02: నిజామాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా, ముఖీడ్ తాలూకా, కేరూర్ గ్రామానికి చెందిన పాండురంగ అనే వ్యక్తి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని సిద్ధమయ్యాడు. అయితే, మూడు పిల్లలు ఉంటే పోటీకి అర్హత ఉండదనే నిబంధన కారణంగా అతడు క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఆరు సంవత్సరాల పెద్ద కుమార్తె ప్రాచినిని బైక్‌పై తీసుకెళ్లి, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ARP క్యాంప్ అవతల కాలువలోకి తోసేశాడు. స్థానికులు కాలువలో చిన్నారి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో చిన్నారి తండ్రే హంతకుడని బయటపడింది. ఈ ఘటనలో పాండురంగతో పాటు అతనికి సహకరించిన గణేష్ షిండేను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఉపయోగించిన బైక్‌తో పాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వెల్లడించారు.
