
DNews: Feb 12: తెలంగాణ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద నిధులను విడతల వారీగా విడుదల చేస్తోంది. ఇప్పటికే మొదటి విడతగా రూ.259.36 కోట్లు విడుదల కాగా, తాజాగా మరో రూ.387 కోట్లు విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం రూ.646.36 కోట్లు గ్రామ పంచాయతీలకు చేరాయి. అయితే, తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం కింద సుమారు రూ.3,000 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో ఇంకా రూ.2,400 కోట్లు విడుదల కావాల్సి ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్రం కోరిన వివరాలను సమర్పించింది. దాని ఆధారంగా కేంద్రం విడతల వారీగా నిధులను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, గ్రామాల అభివృద్ధి కోసం పెండింగ్‌లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
