
DNews: Jan 30: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపూజీని స్మరించారు. ఆయన సామాజిక మాధ్యమాల్లో గాంధీజీ చేసిన త్యాగాలు, ఆయన ఆలోచనలను ప్రస్తావిస్తూ నివాళి అర్పించారు. “అహింస అనే ఆయుధంతో స్వాతంత్ర్య పోరాటాన్ని గెలిచిన మహాత్మా ప్రపంచానికి కొత్త పోరాట మార్గాన్ని చూపించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన ఆ మహానుభావునికి వర్ధంతి సందర్భంగా నా నివాళులు,” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీజీ చూపిన మార్గం, ఆయన విలువలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
