
DNews: Feb 12: సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పై సంగారెడ్డి పోలీసు కేసు నమోదు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదేశాల మేరకు ఎన్నికల విధులను అడ్డుకున్నారనే ఆరోపణలతో IPC సెక్షన్లు 223, 351, 352, 132, 329 కింద కేసు నమోదు చేశారు.
జగ్గారెడ్డి తన వివరణలో, సంగారెడ్డి పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నాయకుడు అద్దును CI గల్లా లాగి కొట్టారని, ఆ సమయంలో తన పార్టీ నాయకుడిని రక్షించడానికి బూత్‌కి వెళ్లి CIని మందలించాల్సి వచ్చిందని తెలిపారు. CI ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతుగా తన పార్టీ నాయకుడిని అవమానించారని, చట్టం మరియు శాంతి భద్రతను ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించారని ఆరోపించారు.
తాను పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని, కానీ తన పార్టీ నాయకుడికి జరిగిన అవమానాన్ని అక్కడికక్కడే తొలగించడానికి బూత్‌కి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. CI గానీ, తాను గానీ ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, దాన్ని అందరూ స్వాగతించాలన్నారు. ఎవరు తప్పు, ఎవరు సరి అనేది కోర్టులో తేలుతుందని, తాను ఈ ఘటనను నిన్న సాయంత్రం 5 గంటలకు ముగించానని తెలిపారు.
ఇక మరోవైపు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కేటీఆర్, హరీష్ రావు మరియు బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ తాను అధికారులను దాడి చేశాడని చూపిస్తున్నారని ఆరోపించారు. గతంలో కేటీఆర్ ఒక పోలీసు అధికారిని “బూత్” అనే పదంతో అవమానించారని, హరీష్ రావు పోలీసులను తన్ని అవమానించారని, “వాళ్లు ఆంధ్రలో పుట్టారా” అంటూ తెలంగాణ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందుగా కేటీఆర్, హరీష్ రావు చేసిన అవమానాలపై స్పందించి, తర్వాత తనపై మాట్లాడితే మంచిదని జగ్గారెడ్డి సూచించారు.
