
DSports 29 Oct:సెయింట్ లూయిస్, అమెరికా: భారత యువ ప్రపంచ చెస్ ఛాంపియన్ డి. గుకేశ్ అద్భుతమైన ప్రదర్శనతో పాటు, తన హుందాతనంతో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవల జరిగిన ‘క్లచ్ చెస్ ఛాంపియన్స్ షోడౌన్’ టోర్నమెంట్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురాపై గెలిచిన తర్వాత, గుకేశ్ చూపిన క్రీడాస్ఫూర్తి అందరి దృష్టిని ఆకర్షించింది.
నేపథ్యం – నకమురా వివాదాస్పద చర్య:
కొద్ది వారాల క్రితం ‘చెక్ మేట్: యూఎస్ఏ వర్సెస్ ఇండియా’ ఎగ్జిబిషన్ చెస్ టోర్నమెంట్లో గుకేశ్‌పై విజయం సాధించిన నకమురా… అతిగా సంబరాలు చేసుకున్నాడు. విజయ ఉద్వేగంలో గుకేశ్‌కు చెందిన ‘రాజు’ (కింగ్) పావును చెస్ బోర్డు నుంచి తీసి ప్రేక్షకుల్లోకి విసిరేశాడు. ఈ చర్య అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. చెస్ వంటి హుందాగా ఆడే క్రీడలో నకమురా ప్రవర్తన క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని చాలా మంది అభిప్రాయపడ్డారు.
