
DET:OCT 28:
మా ఇంటి బంగారం రారంభం: సమంత సంతోషం:
సమంత రూత్ ప్రభు తన ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై నిర్మిస్తున్న రెండవ చిత్రం మా ఇంటి బంగారం షూటింగ్ మొదలైంది.ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియాలో ప్రకటిస్తూ,ముహూర్తం పూజకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అందరి ప్రేమ,ఆశీస్సులతో మా మా ఇంటి బంగారం ప్రయాణాన్ని ప్రారంభించాం.మేం ఏం సృష్టిస్తున్నామో చూపించడానికి ఆత్రుతగా ఉన్నాము…ఈ ప్రత్యేకమైన సినిమా మొదలుపెడుతున్నందుకు మీ అందరి ప్రేమ,మద్దతు కావాలి టూ తన సంతోషాన్ని పంచుకుంది.ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.వీరిద్దరూ గతంలో ఓ బేబీ వంటి విజయాన్ని అందించారు.
క్లాప్బోర్డుతో రాజ్ నిడిమోరు:పుకార్లకు మరింత బలం:
ముహూర్తం వేడుకలో తీసిన ఫోటోలలో,ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు క్లాప్బోర్డు పట్టుకుని మొదటి క్లాప్ ఇస్తున్న దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది.రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి నిర్మాతలలో ఒకరు.అయితే,సమంతతో ఆయనకు ఉన్న సంబంధంపై చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి.ఈ ఇద్దరూ డేటింగ్లో ఉన్నారనే ఊహాగానాలు గతంలో దీపావళి వేడుకల ఫోటోలతో మరింత బలపడ్డాయి.ఇప్పుడు మా ఇంటి బంగారం ముహూర్తంలో రాజ్ పాల్గొనడం,మొదటి క్లాప్ ఇవ్వడం ఆ పుకార్లకు మరింత బలాన్ని ఇచ్చింది.అయినప్పటికీ,తమ సంబంధం గురించి ఇద్దరూ ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
సినిమా గురించి మరిన్ని వివరాలు:
మా ఇంటి బంగారం చిత్రంలో సమంతతో పాటు గుల్షన్ దేవయ్య,దిగంత్,సీనియర్ నటి గౌతమి వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇది భావోద్వేగాలు,యాక్షన్ కలగలిపిన కథ అని తెలుస్తోంది.చాలా కాలం తర్వాత సమంత తెలుగులో పూర్తి స్థాయి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
