DET:OCT24:
విక్కీ కౌశల్ కొత్త చిత్రం ‘మహావతార్’:
వక్కీ కౌశల్ మొదటిసారి ఒక పౌరాణిక పాత్రలో నటించబోతున్న సినిమా ‘మహావతార్’.ఈ చిత్రం ‘చిరంజీవి పరశురాముడి’ జీవితం ఆధారంగా రూపొందనుంది.స్త్రీ,భేదియా వంటి హిట్ చిత్రాల దర్శకుడు అమర్ కౌశిక్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు,ఎందుకంటే ఇది విక్కీ కౌశల్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన చిత్రం కానుంది.

షూటింగ్ ప్రారంభం 2026లో:
ఈ సినిమా షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది.విక్కీ కౌశల్ ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు.ఆ కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే ‘మహావతార్’ కోసం సన్నద్ధం అవుతారు.దర్శకుడు అమర్ కౌశిక్ మాట్లాడుతూ,విక్కీ కౌశల్ తన ఇతర ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి,ఈ పాత్రకు సిద్ధమయ్యాక,వచ్చే సంవత్సరం మధ్యలో మిడ్-నెక్స్ట్ ఇయర్ షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నామని తెలిపారు.

భారీ వీఎఫ్‌ఎక్స్ VFX అవసరం:
దర్శకుడు అమర్ కౌశిక్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ,ఇది తన కెరీర్‌లో ఒక భారీ బాధ్యత అని చెప్పారు.ఎందుకంటే ఈ కథ చిన్నప్పటి నుండీ తనతో ఉందని,అరుణాచల్ ప్రదేశ్‌లోని పరశురాం కుండం దగ్గర నివసించేవాడినని,అక్కడికి తరచుగా వెళ్లేవాడినని తెలిపారు.ఈ కథను తెరకెక్కించడానికి భారీ వనరులు మరియు ఎక్కువగా వీఎఫ్‌ఎక్స్ అవసరమని ఆయన చెప్పారు.విజువల్స్ పట్ల పూర్తి అవగాహన,అనుభవం వచ్చాకే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టే ధైర్యం వచ్చిందని అమర్ కౌశిక్ తెలియజేశారు.

విక్కీ కౌశల్‌కే ఆ పాత్ర ఎందుకు?
విక్కీ కౌశల్‌ను ఈ పాత్ర కోసం ఎంచుకోవడం గురించి దర్శకుడు మాట్లాడుతూ,నేను అతన్ని కలిసినప్పుడల్లా,అతనిలో చాలా పవిత్రత కనిపిస్తుంది.ఈ పాత్రను పోషించడానికి అతను సరైన వ్యక్తి” అని ప్రశంసించారు.వీఎఫ్‌ఎక్స్ ఎక్కువగా ఉండే ఈ సినిమా కోసం స్క్రిప్టింగ్ పూర్తయింది.సెట్ డిజైన్,ఆయుధాల డిజైన్ మరియు ప్రతి పాత్ర రూపకల్పనపై ఆరు-ఏడు నెలలుగా పనులు జరుగుతున్నాయని అమర్ కౌశిక్ వెల్లడించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana