DET:OCT 12:
విజయ్ దేవరకొండ – కీర్తి సురేష్ కాంబినేషన్లో కొత్త సినిమా షురూ!
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కలిసి ఒక కొత్త సినిమాలో నటించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతానికి దీన్ని ‘VD59’ అని పిలుస్తున్నారు అధికారికంగా ప్రారంభమైంది. ‘మహానటి’ సినిమాలో కలిసి నటించినా, వారిద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ లేవు. అందుకే, ఈ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గ్రామీణ యాక్షన్ డ్రామాగా సినిమా:
ఈ చిత్రానికి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం. విజయ్ దేవరకొండ తన గత సినిమాలతో పోలిస్తే, ఈసారి ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. కీర్తి సురేష్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

షూటింగ్ ఆ తేదీ నుంచే ప్రారంభం:

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, ‘VD59’ షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో పీరియడ్ డ్రామా VD 13 షూటింగ్ పూర్తి చేసిన వెంటనే, ఈ కొత్త సినిమా సెట్స్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. అక్టోబర్‌లో మొదటి షెడ్యూల్ మొదలవుతుందని చిత్ర యూనిట్ తెలియజేసింది.

భారీ అంచనాలున్నాయి:
విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ ఇద్దరికీ టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త తరహా కథాంశంతో, గ్రామీణ నేపథ్యం, యాక్షన్ అంశాలు ఉండడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana