D Spiritual: Nov 23: జగన్మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన సీతారామచంద్రస్వామి

దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో క్షీరాబ్ది ద్వాదశి (చిలుకు ద్వాదశి) పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేకంగా జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

వేడుకల్లో భాగంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, క్షీరాన్ని (పాలను) ప్రత్యేకంగా నివేదించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కే. దామోదర్ రావు, ప్రధానార్చకులు విజయ రాఘవన్, వేద పండితులు, ఆలయ సూపరింటెండెంట్ లింగాల సాయిబాబా, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *