
D news:nov:18స్టెప్ 1: ముందుగా ఒక కప్పు రాగి పిండిని ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి మిశ్రమం మెత్తగా, చిక్కదనం లేకుండా ఉండేలా చూసుకోవాలి.
స్టెప్ 2: ఇప్పుడు ఒక పాత్రలో 200 గ్రాముల బెల్లం తీసుకుని కొద్దిగా నీళ్లు పోయాలి. స్టవ్‌పై పెట్టి బెల్లం పూర్తిగా కరిగే వరకు వేడి చేయాలి. అనంతరం బెల్లం పాకాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3: మరో పాన్‌ను స్టవ్‌పై పెట్టి ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో పోయాలి. మంటను తక్కువగా ఉంచి గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి. పిండి ఉండలు కట్టకుండా, అడుగున అంటుకోకుండా జాగ్రత్తగా కలుపుతూ మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి.
స్టెప్ 4: రాగి పిండి మిశ్రమం మెత్తగా చిక్కబడిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం నీటిని అందులో పోయాలి. బెల్లం, రాగి పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ హల్వా పాన్‌కు అంటుకోకుండా, పాన్ అంచుల నుంచి విడిపోయే వరకు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే.. రుచికరమైన రాగి పిండి హల్వా రెడీ!
వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ హల్వాను సర్వ్ చేసుకోవచ్చు. రాగుల పోషకాలు, బెల్లం తీపి, నెయ్యి సువాసన కలిపి ఈ స్వీట్‌ను మరింత రుచికరంగా మారుస్తాయి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ సంప్రదాయ వంటకాన్ని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి!
