D Spiritual: Nov 17: జనగామ: జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి మాస కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక హోమం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణ క్రతువును వైభవంగా జరిపించారు. ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రసాద వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, అర్చకులు రవీందర్ శర్మ, శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆదిత్యతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *