D Spiritual: Nov 11: కొండగట్టు అంజన్న దర్శనానికి ఐదు రోజుల పాటు విరామం.. ఆర్జిత సేవలు నిలిపివేత!

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు తాత్కాలికంగా దర్శన విరామం కల్పించనున్నారు. గర్భాలయంలోని మూలవిరాట్‌పై ఉన్న చందనాన్ని తొలగించే కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో ఐదు రోజుల పాటు స్వామివారి దర్శనాలను నిలిపివేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

చందనం తొలగింపు కార్యక్రమం జరిగే ఐదు రోజుల పాటు వాహన పూజలు మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలను నిలిపివేయనున్నారు. ఈ సమయంలో గర్భాలయంలోని మూలవిరాట్ దర్శనానికి భక్తులకు అనుమతి ఉండదు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో చెక్కతో ప్రత్యేకంగా తయారు చేయించిన స్వామివారి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి దర్శన సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్వామివారి కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *