
DNews: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే బోయినపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
నేరాల నియంత్రణకు పెట్రోలింగ్, రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని, గ్రామాలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
అలాగే ఓటీపీ మోసాలు, నకిలీ కేవైసీ, డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని, మైనర్ల డ్రైవింగ్, మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
