ముఖేష్‌తో గతంలో గొడవ.. వారం రోజుల పాటు మాట్లాడుకోలేదు

నటి జ్యోతి పూర్వజ్ బిగ్ బాస్ రియాలిటీ షోపై, ప్రస్తుతం హౌస్‌లో ఉన్న నటుడు ముఖేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు బిగ్ బాస్ నుంచి మూడుసార్లు ఆహ్వానం వచ్చినప్పటికీ, ఆ షోలో పాల్గొనడానికి నిరాకరించినట్లు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. బిగ్ బాస్‌లోకి వెళ్లకపోవడానికి గల కారణాలతో పాటు ముఖేష్‌తో తనకున్న పరిచయం, గతంలో జరిగిన గొడవ గురించి వివరించారు.
ఇటీవల జ్యోతి పూర్వజ్ నటించిన ‘కిల్లర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బిగ్ బాస్ షో తనకు సరిపడదని, జనాలతో ఎక్కువసేపు కలిసి ఉండటం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. ఐదు లేదా పది నిమిషాలు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడమే తనకు ఇష్టమని తెలిపారు. పోటీల్లో పాల్గొనడం, ఎక్కువ సమయం జనాల మధ్య గడపడం తన స్వభావానికి సరిపోవని, అందుకే మూడుసార్లు వచ్చిన అవకాశాలను వదులుకున్నానని పేర్కొన్నారు.
ముఖేష్ వ్యక్తిత్వం గురించి ఏమన్నారంటే?
బిగ్ బాస్ హౌస్‌లో ముఖేష్‌పై వస్తున్న విమర్శల గురించి జ్యోతి స్పందించారు. హౌస్‌లో ఏం జరుగుతుందో, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకు పూర్తిగా తెలియదని అన్నారు. కాబట్టి షోలో కనిపించే కొన్ని సంఘటనలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ముఖేష్, తన బంధువు చైత్రా రాయ్ ఇద్దరూ తనకు బాగా తెలుసని చెప్పారు. వారితో కలిసి తాను సుమారు మూడేళ్లపాటు పనిచేశానని గుర్తుచేశారు. ముఖేష్ తన కెరీర్‌పై ఎంతో శ్రద్ధ చూపిస్తాడని, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తాడని తెలిపారు. ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెడతాడని, జిమ్నాస్టిక్స్ సైతం నేర్చుకున్నాడని చెప్పారు.
అంతేకాకుండా ముఖేష్ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడని జ్యోతి పేర్కొన్నారు. తల్లిదండ్రులు, సోదరి పట్ల బాధ్యతగా ఉంటాడని, కుటుంబ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచిస్తాడని వివరించారు.

ముఖేష్‌తో గతంలో గొడవ జరిగింది!
ముఖేష్‌తో తనకు గతంలో ఒకట్రెండుసార్లు గొడవలు జరిగినట్లు జ్యోతి వెల్లడించారు. అప్పట్లో అతనికి మంచి పాపులారిటీ రావడంతో మాటతీరులో కొంత మార్పు కనిపించిందని చెప్పారు. తన అనుభవం, ముఖేష్ వైఖరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు.
ఈ గొడవ కారణంగా దాదాపు వారం రోజుల పాటు ఇద్దరూ మాట్లాడుకోలేదని, ఆ తర్వాత మళ్లీ కలిసిపోయి స్నేహితులుగా మారామని చెప్పారు. ముఖేష్ తనకు చిన్నపిల్లాడిలాంటి వాడని పేర్కొన్నారు.
బిగ్ బాస్‌లో ముఖేష్ ప్రవర్తన చూసి షాక్!
తనకు తెలిసిన ముఖేష్ గతంలో తన ఎదుగుదల, కెరీర్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేవాడని జ్యోతి తెలిపారు. తాను ఎదగాలని, మంచి పేరు సంపాదించుకోవాలని, అందరూ తనను ఇష్టపడాలని కోరుకునేవాడని చెప్పారు.
అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఇతరులు కూడా బాగా ఆడాలని, వారి ఆట మెరుగ్గా ఉండాలని ముఖేష్ కోరుకుంటున్నట్లు వింటున్నానని వెల్లడించారు. అతనిలో కనిపిస్తున్న ఈ మార్పు తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
గత మూడు, నాలుగు సంవత్సరాల్లో ముఖేష్ ఆలోచనా విధానంలో మార్పు వచ్చి ఉండవచ్చని, లేదా ఇతరుల ప్రభావం అతనిపై పడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తాను బిగ్ బాస్ షోను క్రమం తప్పకుండా చూడకపోయినా, ముఖేష్ గురించి బయట వింటున్న విషయాలు మాత్రం తనకు ఆశ్చర్యంగా ఉన్నాయని జ్యోతి పూర్వజ్ తెలిపారు.
