Singareni Offers Second Chance to Dismissed Employees: Applications Invited for Reappointment

గైర్హాజరు కారణంగా 2023–2025 మధ్య విధుల నుంచి తొలగించిన వారికి పునర్నియామకం.. ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచన

కాకతీయఖని (భూపాలపల్లి): సింగరేణి సంస్థలో గైర్హాజరు కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి యాజమాన్యం మరో అవకాశం కల్పించింది. 2023 నుంచి 2025 మధ్య విధులకు హాజరుకాకపోవడంతో తొలగింపునకు గురైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు నిర్ణయించినట్లు భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పునర్నియామక ప్రక్రియ కోసం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

పునర్నియామకానికి అర్హతలు ఇవే..

2026 ఏప్రిల్‌ నాటికి 46 ఏళ్ల వయసు కలిగి ఉండటంతో పాటు, గత ఐదేళ్లలో ఏవైనా రెండేళ్లలో కనీసం 100 మస్టర్లు పూర్తి చేసిన వారు పునర్నియామకానికి అర్హులని జనరల్‌ మేనేజర్‌ తెలిపారు. అభ్యర్థులు వైద్యపరంగా పూర్తి ఫిట్‌నెస్‌ కలిగి ఉండాలని స్పష్టం చేశారు.

అర్హత ఉన్న ఉద్యోగులు ఈ నెల 14వ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *