: Giant Pumpkins Weighing 12–15 Kg Amaze Everyone in Telangana Farmer’s Organic Farm!

సాధారణంగా 2 నుంచి 5 కిలోల బరువుండే గుమ్మడికాయలు.. ఏకంగా 12 నుంచి 15 కిలోల బరువుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం అక్కెపల్లి గ్రామానికి చెందిన రైతు చొప్పరి ఓదేలు తన వ్యవసాయ క్షేత్రంలో భారీ గుమ్మడికాయలను పండించారు. కరీంనగర్‌ నుంచి ప్రత్యేకంగా విత్తనాలు తీసుకొచ్చిన ఆయన.. సేంద్రియ పద్ధతిలో ఈ పంటను సాగు చేశారు.

ప్రస్తుతం పంట కోతకు సిద్ధం కావడంతో గుమ్మడికాయలు ఒక్కొక్కటి 12 నుంచి 15 కిలోల బరువుతో ఆకట్టుకుంటున్నాయి. సాధారణ కాయల కంటే పెద్ద పరిమాణంలో ఉండటంతో స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ భారీ గుమ్మడికాయలను ఓదేలు మంథనిలోని ఓ కూరగాయల దుకాణంలో విక్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *