
D Spiritual: Nov 3: మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మృత్తికా బృందావనానికి విశేష పూజలు
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళవారం ఉదయం రాఘవేంద్ర స్వామి మృత్తికా బృందావనానికి, వెండి పాదుకలకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీమఠంలోని యజ్ఞమంటపంలో అర్చకులు, దివాన్ శ్రీనాథ ఆచార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి వెండి పాదుకలను వెండి సింహాసనంపై ప్రతిష్ఠించి పుష్పాభిషేకం, కనకాభిషేకం, ముత్యాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి మంగళహారతులు సమర్పించారు.
పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ఫలమంత్ర అక్షింతలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మఠం పరిచారక సిబ్బంది పాల్గొన్నారు. పాదపూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
