
D Educt: Oct 21: ఇన్సర్వీస్ టీచర్ల కోసం నవంబరు 16 నుంచి 21వ తేదీ వరకు ప్రత్యేకంగా నిర్వహించనున్న టెట్-2కు మొత్తం 9,262 దరఖాస్తులు అందినట్లు టెట్ కన్వీనర్ గాజర్ల రమేశ్ తెలిపారు.
ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పేపర్-1కు మొత్తం 1,267 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారితో పాటు, ఇప్పటికే టెట్ ఉత్తీర్ణులై ఎస్జీటీలుగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాలనుకునే వారి నుంచి 6,671 దరఖాస్తులు అందాయి.
ఇక పేపర్-1, పేపర్-2 రెండింటికీ హాజరయ్యేందుకు మరో 1,324 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక టెట్ ద్వారా పదోన్నతులు కోరుకునే టీచర్లకు అవకాశం కల్పించనున్నారు.
