
D Educt: Oct 11: యూపీఎస్సీ ఎన్‌డీఏ–2 ఫలితాలు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), నేవల్ అకాడమీ (ఎన్ఏ) పరీక్ష–2 (2026) ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబర్ 13న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల మెరిట్ జాబితాను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా ఫలితాల పీడీఎఫ్‌ను ఎలాంటి లాగిన్ వివరాలు లేకుండా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మెరిట్ జాబితాలో తమ రోల్ నంబర్ ఉందో లేదో పరిశీలించుకోవాలి.
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి ఎంపిక ప్రక్రియలో భాగంగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ దశలో అభ్యర్థుల వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, మానసిక సామర్థ్యాలను అంచనా వేస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులు ఫలితాలు విడుదలైన రెండు వారాల్లోగా joinindianarmy.nic.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. తదుపరి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించాలి.
