
D Educt: Oct 8: రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల రోజువారీ హాజరు కనీసం 70 శాతం ఉండేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. హాజరు శాతం 70 కంటే తగ్గిన పాఠశాలలను ప్రత్యేకంగా సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులను సూచించారు.
క్యూఆర్ పరిధిలో ప్రతిరోజూ సుమారు లక్షన్నర మంది విద్యార్థులు పాఠశాలలకు గైర్హాజరవుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా సగటు హాజరు 63 శాతంగా మాత్రమే ఉందని అక్టోబర్ 6న ‘ఈనాడు’లో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అక్టోబర్ 7న అధికారులకు తాజా ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి విద్యార్థి సగటు హాజరు శాతం 70గా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే ముఖగుర్తింపు ఆధారిత హాజరు వివరాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఒకే విధంగా ఉండాలని ఆదేశించారు. ఈ రెండు వివరాల్లో వ్యత్యాసం కనిపిస్తే దానికి గల కారణాలను ప్రతిరోజూ పరిశీలించి, పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
