D News: Oct 2: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (RRBs) అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (CEN 01/2025) ఉద్యోగాలకు సంబంధించిన సీబీటీ-2 రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశాయి. 2026 జులై 28న నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన రీజియన్ల వారీ కటాఫ్‌ మార్కులను కూడా అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాయి.

మొత్తం 10,970 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన సీబీటీ-1 పరీక్ష ఫలితాలను జూన్‌ 12న వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఫిబ్రవరి 13, 16, 17, 18 తేదీలతో పాటు మార్చి 11న నిర్వహించారు.

సీబీటీ-2లో తదుపరి దశకు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్‌ నంబర్లను పీడీఎఫ్‌ రూపంలో విడుదల చేశారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి వ్యక్తిగత స్కోర్‌కార్డులను పొందవచ్చు.

సీబీటీ-2లో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశగా 2026 అక్టోబర్‌ 30న కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (CBAT) నిర్వహించనున్నారు. అనంతరం డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.