D Educt: Oct 2: ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌, నాన్‌మైనారిటీ, మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ యాజమాన్య సీట్ల భర్తీకి విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష రాసిన అర్హత కలిగిన అభ్యర్థులు గురువారం నుంచి అక్టోబరు 6వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, అవసరమైన ధ్రువపత్రాలను జత చేసి ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

నర్సింగ్‌ ప్రవేశ మార్గదర్శకాలకు సంబంధించి సందేహాలుంటే 89787 80501 నంబర్‌ను సంప్రదించాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే 90007 80707 నంబర్‌కు సంప్రదించాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సాయిసుధీర్‌ సూచించారు.