
D News | జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్). Greatest Of All Times అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్గా నటిస్తోంది. వేదవ్యాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ సమర్పణలో నవంబర్ 12న ‘G.O.A.T’ గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
“వినోదం, భావోద్వేగాలు, పిచ్చి చేష్టలతో నిండిన ఉత్కంఠభరితమైన వెండితెర అనుభవానికి సిద్ధంగా ఉండండి.. థియేటర్లలో కలుద్దాం” అంటూ మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు.
ఇప్పటికే ‘G.O.A.T’ నుంచి విడుదలైన పోస్టర్లు, ఇతర కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. త్వరలోనే మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
సుధీర్ కెరీర్లో మైల్స్టోన్ మూవీ..
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. సినిమా నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని తెలిపారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. టెక్నికల్‌గా కూడా సినిమా ఉన్నత స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు.
“సుడిగాలి సుధీర్ కెరీర్లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది” అని నిర్మాత తెలిపారు.
మొత్తానికి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సందేశాన్ని కూడా కలిపి రూపొందుతున్న ‘G.O.A.T’ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
