
D News : మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ ఎంట్రీకి సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన ఓ ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్ షో చేయనున్నట్లు సమాచారం. పలు ఎపిసోడ్లుగా ఈ కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తోంది.
డాక్యుమెంటరీకి బదులు పాడ్‌కాస్ట్
చిరంజీవి జీవిత ప్రయాణంపై డాక్యుమెంటరీ రూపొందించాలనే ఆలోచన తొలుత ఉందట. అయితే తన అనుభవాలను మరింత స్వేచ్ఛగా ప్రేక్షకులతో పంచుకునేందుకు పాడ్‌కాస్ట్ అయితే బాగుంటుందని చిరంజీవి సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం సెలబ్రిటీ పాడ్‌కాస్ట్‌లకు పెరుగుతున్న ఆదరణ కూడా దీనికి కారణంగా చెబుతున్నారు.
కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు
ఈ పాడ్‌కాస్ట్‌లో చిరంజీవి తన దశాబ్దాల సినీ ప్రయాణం, కెరీర్‌లోని మధుర జ్ఞాపకాలు, ఎదుర్కొన్న సవాళ్లు, మరచిపోలేని అనుభవాల గురించి మాట్లాడనున్నట్లు టాక్. దీంతో మెగాస్టార్ అభిమానులకు ఆయన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిసే అవకాశం ఉంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌పై నెట్‌ఫ్లిక్స్ లేదా చిరంజీవి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
