Hanuman Ansh Crosses ₹400 Crore Worldwide on Day 52 Despite New Releases

D News : బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంశ్’ హవా కొనసాగుతోంది. విడుదలై 52 రోజులు పూర్తయినా ఈ ఆధ్యాత్మిక డ్రామా కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చినా.. ఆదివారం వచ్చిన వసూళ్లతో ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది.

ట్రేడ్ లెక్కల ప్రకారం 52వ రోజున దేశవ్యాప్తంగా 4,387 షోల ద్వారా సుమారు రూ.9 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో ఇండియాలో మొత్తం నెట్ కలెక్షన్లు రూ.307.03 కోట్లకు చేరగా.. ఇండియా గ్రాస్ రూ.362.70 కోట్లుగా నమోదైంది.

వరల్డ్‌వైడ్‌గా రూ.401.20 కోట్లు

ఓవర్సీస్‌లోనూ ‘హనుమాన్ అంశ్’కు మంచి స్పందన కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే అక్కడ సుమారు రూ.75 లక్షల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. దీంతో విదేశీ మార్కెట్ మొత్తం గ్రాస్ రూ.38.50 కోట్లకు చేరింది.

ఇండియా, ఓవర్సీస్ వసూళ్లను కలిపితే సినిమా వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.401.20 కోట్లకు చేరినట్లు ట్రేడ్ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎనిమిదో వారంలోనూ ఈ స్థాయి వసూళ్లు రావడం ఆసక్తికరంగా మారింది.

ఇక ఇదే సమయంలో నాని ‘ది ప్యారడైజ్’, ‘ది వ్వాన్ – ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ వంటి కొత్త చిత్రాలు థియేటర్లలోకి వచ్చినా ‘హనుమాన్ అంశ్’ తన వసూళ్లను కొనసాగించడం గమనార్హం. ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

By Avinash