
D News : బిగ్ బాస్ తెలుగు 10లో వీకెండ్ ఎపిసోడ్ ప్రేక్షకులకు వరుస ట్విస్టులు ఇచ్చింది. డే 20లో నాగార్జున హౌస్మేట్స్ ఆటను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ.. ఎక్కడ తప్పు చేశారో, ఎక్కడ మెరుగుపడాలో చెప్పుకొచ్చారు. దీంతో కొందరికి ప్రశంసలు దక్కగా.. మరికొందరికి గట్టిగానే వార్నింగ్‌లు వచ్చాయి.
సుధీర్–సృష్టి వివాదాన్ని ప్రస్తావించిన నాగార్జున.. అనుచిత పదజాలం విషయంలో సుధీర్‌ను హెచ్చరించారు. చరణ్‌కు కూడా ఇతరుల ఆటపై కామెంట్లు చేసే ముందు తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అమన్, వర్షిణి వ్యవహారంలోనూ అసలు పరిస్థితిని వివరించి క్లారిటీ ఇచ్చారు.
రామ్ ప్రసాద్ గేమ్ ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా హైలైట్ అయింది. అతడి వ్యూహాలను ‘కన్నింగ్’గా కాకుండా తెలివైన గేమ్‌గా పేర్కొన్న నాగార్జున.. సరదాగా అతడికి ‘చాణక్యుడు’ అనే పేరు పెట్టారు. నరేష్ ఆటతీరును కూడా మెచ్చుకున్నారు. మరోవైపు టెంపర్ వంశీ తన గేమ్‌లో మరింత యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.
త్రిగుణ్ సంచాలక్‌గా తీసుకున్న ఓ నిర్ణయంపై హౌస్‌లో విమర్శలు వచ్చినా.. నాగార్జున వీడియో ద్వారా అతడి నిర్ణయం సరైనదేనని వివరించారు. దేబ్జానీతో పాటు మరికొందరికి వ్యక్తిగత విమర్శలు, అవసరం లేని వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు.
రూ.15 లక్షల దగ్గర అసలు ట్విస్ట్
ఎపిసోడ్ చివర్లో బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్‌తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. హౌస్ నుంచి వెంటనే బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న కంటెస్టెంట్‌కు రూ.5 లక్షలతో మొదలైన ఆఫర్.. క్రమంగా రూ.10 లక్షలు దాటి రూ.15 లక్షలకు చేరింది.
ఈ సమయంలో మిథిలేష్ ఆ ఆఫర్‌పై ఆసక్తి చూపించారు. మిగతా కంటెస్టెంట్లు అతడిని ఆపేందుకు ప్రయత్నించినా.. చివరకు రూ.15 లక్షలను అంగీకరించినట్లు ఎపిసోడ్లో చూపించారు.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఈ రూ.15 లక్షలు ప్రత్యేకంగా ఇచ్చే మొత్తమేమీ కాదు. బిగ్ బాస్ విజేతకు దక్కే ప్రైజ్ మనీలోనే ఈ మొత్తాన్ని మినహాయిస్తామని నాగార్జున స్పష్టం చేశారు. దీంతో మిథిలేష్ నిర్ణయం ఎపిసోడ్లో చర్చనీయాంశంగా మారింది.
