Chiranjeevi New Multiplex in Hyderabad: Asian Megastar Cineplex Set for Sankranti 2027 Opening?

D News : మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో పాటు థియేటర్ వ్యాపారంలోనూ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆసియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో భారీ మల్టీప్లెక్స్ ప్రాజెక్టులో ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఇదే సమయంలో నగరంలో మరో మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది.

కుషాయిగూడలో కొత్త మల్టీప్లెక్స్?

తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉన్న టల్లూరి థియేటర్లను ఆసియన్ సినిమాస్, చిరంజీవి భాగస్వామ్యం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న థియేటర్లను ఆధునిక హంగులతో పునరుద్ధరించి మల్టీప్లెక్స్ తరహాలో మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

కొత్త మల్టీప్లెక్స్‌కు ‘ఆసియన్ మెగాస్టార్ సినీప్లెక్స్’ అనే పేరు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెరుగైన సౌండ్, ప్రొజెక్షన్ సిస్టమ్‌తో పాటు ప్రేక్షకులకు ఆధునిక సినిమా అనుభూతిని అందించేలా థియేటర్లను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి 2027కి ఓపెనింగ్?

ఈ కొత్త మల్టీప్లెక్స్‌ను సంక్రాంతి 2027 సందర్భంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్ని స్క్రీన్స్ ఉంటాయి, సీటింగ్ కెపాసిటీ ఎంత, ఎలాంటి టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది అనే వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆసియన్ సినిమాస్‌తో కలిసి చిరంజీవి నిర్మిస్తున్న భారీ మల్టీప్లెక్స్ ప్రాజెక్టుపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు కుషాయిగూడలో కొత్త మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

By Avinash