D Spiritual: Sept 26: శ్రీ రాచన్న స్వామి ఆలయ కమిటీ సభ్యులకు ఘన సన్మానం

కోహిర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బడంపేట్ శ్రీ రాచన్న స్వామి ఆలయ కమిటీ చైర్మన్, సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, మాజీ మంత్రి, జహీరాబాద్ ఇన్‌చార్జ్ డా. ఏ. చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులను సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ రాచన్న స్వామి ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. ఆలయ అభివృద్ధితో పాటు కోహిర్ ప్రాంతం కూడా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శ్రీ రాచన్న స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, సీడీసీ చైర్మన్ ముబీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్షద్ అలీ, మండల అధ్యక్షుడు సువర్ణ మల్లన్న పాటిల్, మాజీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి, మంకల్ శుభాష్ సెట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్ పాల్గొన్నారు. వీరితో పాటు సర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.