OTT Releases Today: 10+ New Movies and Web Series Streaming From Horror to Comedy

D News : ఈ వీకెండ్ ఇంట్లోనే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునే వారికి OTT ప్లాట్‌ఫామ్‌లు భారీ లైనప్‌ను తీసుకొచ్చాయి. సెప్టెంబర్ 25 శుక్రవారం ఒక్కరోజే పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. హారర్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో పాటు ఇంటర్నేషనల్ కంటెంట్ కూడా అందుబాటులోకి వచ్చింది.

‘అగధ’ నుంచి ‘హాయ్’ వరకు..

ఈ వారం వచ్చిన ముఖ్యమైన సినిమాల్లో తెలుగు హారర్ థ్రిల్లర్ ‘అగధ’ ఒకటి. ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

నయనతార, కవిన్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘హాయ్’ కూడా OTTలోకి వచ్చింది. విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

అల్లరి నరేష్ నటించిన ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. చంద్ర‌మోహ‌న్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత డిజిటల్ ప్రీమియర్ జరుపుకుంటోంది.

క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా

హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బేబీ డూ ఆర్ డై’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ధనుష్ తండ్రి కస్తూరి రాజా నటించిన తమిళ పీరియడ్ రొమాంటిక్ డ్రామా ‘హబీబీ’ కూడా సోనీ లివ్‌లోకి వచ్చింది. మీరా కతిరవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.

ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏం చూడొచ్చంటే..

Netflix

  • బేబీ డూ ఆర్ డై – క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్
  • Unabomber – హాలీవుడ్ మూవీ
  • The Different World – హాలీవుడ్ మూవీ
  • The Final Problem – స్పానిష్ వెబ్ సిరీస్

Amazon Prime Video

  • రంభ ఊర్వశి మేనక – తెలుగు
  • Photographer – ఫాంటసీ థ్రిల్లర్
  • Don’t Be Shy – రొమాంటిక్ కామెడీ

ZEE5

  • అగధ – హారర్ థ్రిల్లర్
  • Bakaitee Season 2 – హిందీ సిరీస్
  • హాయ్ – తెలుగు డబ్

JioHotstar

  • Hunkar: The Roar – కోర్ట్‌రూమ్ డ్రామా
  • Mango Pachha – తెలుగు డబ్

Sony LIV

  • హబీబీ – తమిళ రొమాంటిక్ డ్రామా

Sun NXT

  • Angeekaram – స్పోర్ట్స్ డ్రామా

హారర్, కామెడీ, రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్స్‌తో పాటు వివిధ భాషల కంటెంట్ ఒకేసారి OTTలోకి రావడంతో ఈ వీకెండ్ ప్రేక్షకులకు చూసేందుకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

By Avinash