
D Educt: Sept 24: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు వేతనం లభించనుంది. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) నిర్వహించనున్నారు. ఇందులో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానాలకు సంబంధించిన పరీక్షలు ఉండే అవకాశం ఉంది. అనంతరం వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఆధారంగా తుది ఎంపిక చేపట్టనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, శారీరక ప్రమాణాలు, ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించాలని అధికారులు సూచించారు.
