Bethlehem Kudumba Unit Nears Jana Nayagan’s Box Office Mark With Over Rs 322 Crore Worldwide

D News: మలయాళ సినిమాకు మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. పెద్ద స్టార్ ఇమేజ్ లేకపోయినా కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ వసూళ్లలో దూసుకెళ్తోంది. నివిన్ పౌలి, మమితా బైజు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఏ.డి. తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.322.81 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తాజా బాక్సాఫీస్ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

‘జన నాయగన్’పై కన్ను..

ప్రస్తుతం ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే రూ.323 కోట్ల మార్క్‌ను కూడా దాటే అవకాశముంది. అదే జరిగితే విజయ్ నటించిన ‘జన నాయగన్’తో ఉన్న వసూళ్ల వ్యత్యాసం పూర్తిగా చెరిగిపోనుంది. వివిధ బాక్సాఫీస్ ట్రాకర్లలో ఈ రెండు సినిమాల గణాంకాల్లో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇప్పటికే రూ.320 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

‘లోక’ రికార్డును దాటేసి..

ఇక మలయాళ బాక్సాఫీస్ పరంగా చూస్తే ఈ సినిమా ఇప్పటికే ‘లోక’ రికార్డును అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. కేవలం స్టార్ హీరోల సినిమాలే భారీ వసూళ్లు సాధిస్తాయనే అంచనాలను తలకిందులు చేస్తూ.. కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.

కంటెంట్‌తోనే భారీ విజయం..

యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా సినిమాకు కనెక్ట్ కావడం ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’కు ప్రధాన బలంగా మారింది. గిరీష్ ఏ.డి. గతంలో తెరకెక్కించిన ‘ప్రేమలు’తో పోలికలు రావడం, మమితా బైజు మరోసారి హీరోయిన్‌గా కనిపించడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఇప్పటికే రూ.322 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా మరికొంత కాలం ఇదే జోరును కొనసాగిస్తే రూ.350 కోట్ల మార్క్‌కు చేరువయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే తుది వసూళ్లు మాత్రం సినిమా పూర్తి థియేట్రికల్ రన్ తర్వాతే స్పష్టమవుతాయి.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana