
D Educt: Sept 22: బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 29 నుంచి ప్రారంభం కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఆన్లైన్ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు కొనసాగనుంది. అనంతరం అభ్యర్థులు అక్టోబరు 5 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్లో భాగంగా అక్టోబరు 12న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
