
డబ్బులు అధికారం ఉంటే ఈ దేశంలో ఏదైనా దొరుకుతుంది అంటూ బెయిల్‌పై విడుదలైన నిందితుడు చేసిన వ్యాఖ్యలపై బాధిత కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిందితుడి బెయిల్‌ను రద్దు చేయాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది.
ఈ కేసు హరియాణాలోని బెర్లాలో 2022 అక్టోబర్ 28న చోటుచేసుకుంది. భూతగాదా విషయంలో గజానంద్ విశాల్ మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో గజానంద్ మృతి చెందాడు. దీంతో పోలీసులు విశాల్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
బెయిల్ కోసం విశాల్ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తొలుత మంజూరు కాలేదు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో పంజాబ్ హరియాణా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన అనంతరం విశాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీంతో బాధిత కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించి విశాల్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బెయిల్ రద్దు చేయడానికి నిరాకరించింది. దీంతో విశాల్‌కు కొనసాగుతున్న బెయిల్ యథాతథంగా కొనసాగనుంది.
