
D Educt: Sept 22: మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్ (ఎండీఎస్) కోర్సు ఫీజులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ నాన్‌మైనారిటీ దంత వైద్య కళాశాలల్లో ఎండీఎస్ కోర్సుకు పాత ఫీజులనే కొనసాగించాలని నిర్ణయించింది.
2023-26 బ్లాక్ పీరియడ్‌కు ఖరారు చేసిన ట్యూషన్ ఫీజులనే 2026-29 బ్లాక్ పీరియడ్‌కు కూడా వర్తింపజేయనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబరు 21న విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ కాలానికి సంబంధించి ట్యూషన్ ఫీజుల్లో ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఎంబీబీఎస్ కోర్సు ఫీజులను పెంచకుండా ప్రభుత్వం విద్యార్థులకు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎండీఎస్ కోర్సు ఫీజులను కూడా పెంచకపోవడంతో దంత వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కూడా ఉపశమనం లభించనుంది.
