Raghav Juyal’s Dance With Suma Steals the Show at The Paradise Pre-Release Event

D News: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు రాఘవ్ జుయల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్టేజ్‌పై రాఘవ్ జుయల్ మాస్ డ్యాన్స్

‘ది ప్యారడైజ్’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న విక్రమ్ మాలిక్ పాత్రలో రాఘవ్ జుయల్ కనిపించనున్నారు. బాలీవుడ్‌లో డ్యాన్సర్, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.

ప్రీ-రిలీజ్ వేడుకలో ‘ఆయా షేర్’ పాటకు రాఘవ్ జుయల్ తనదైన శైలిలో డ్యాన్స్ చేసి సందడి చేశారు. ముఖ్యంగా ఆయన ట్రేడ్‌మార్క్ స్లో మోషన్ స్టెప్పులతో స్టేజ్‌ను షేక్ చేశారు. రాఘవ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి ఈలలు, కేరింతలు వినిపించాయి.

సుమతో కలిసి జానపద పాటకు స్టెప్పులు

ఆ తర్వాత యాంకర్ సుమతో రాఘవ్ చేసిన సరదా సంభాషణ కూడా ఈవెంట్‌లో నవ్వులు పూయించింది. సుమ అడగడంతో ‘ఏషనాగుల కట్ట మీద’ జానపద పాటకు ఆమెతో కలిసి రాఘవ్ స్టెప్పులు వేశారు. వీరిద్దరి డ్యాన్స్‌ను నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఆసక్తిగా చూస్తూ ఎంజాయ్ చేశారు.

ప్రస్తుతం ఈ పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ది ప్యారడైజ్’లో రాఘవ్ జుయల్ పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో పెరుగుతోంది.

2014లో ‘సోనాలి కేబుల్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రాఘవ్.. ఆ తర్వాత హిందీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించారు. ‘అభయ్’ వెబ్ సిరీస్‌లో నెగెటివ్ రోల్‌లో కనిపించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో తెలుగు తెరపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో చూడాలి.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana