D Educt: Sept 22: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల సిలబస్‌పై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సెప్టెంబరు 21న కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం సిలబస్‌లో మార్పులు చేసేందుకు ఎలాంటి కమిటీని నియమించలేదని కమిషన్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో సిలబస్‌లో ఏవైనా కీలక మార్పులు చేయాల్సి వస్తే, వాటిని అభ్యర్థులకు కనీసం ఏడాది ముందుగానే తెలియజేస్తామని వెల్లడించింది.

‘ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ సిలబస్‌లో మార్పులు చేస్తోందా?’ అంటూ పలువురు అభ్యర్థుల నుంచి కమిషన్‌కు విజ్ఞాపనలు, విచారణలు వస్తున్నాయి. సిలబస్ మార్పులపై సోషల్ మీడియా, ఇతర వేదికల్లో అసత్య ప్రచారాలు పెరుగుతున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ ఈ అంశంపై అధికారికంగా వివరణ ఇచ్చింది.

టీజీపీఎస్సీ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం నాటి ఛైర్మన్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలోని తొలి కమిషన్ సిలబస్‌ను రూపొందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు అభ్యర్థులు సిద్ధమయ్యేలా, తెలంగాణకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా సిలబస్‌ను రూపొందించారు.

ఆ తర్వాత జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలోని రెండో కమిషన్ గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల సిలబస్‌లో స్వల్ప మార్పులు చేసింది. ఇదే సమయంలో ఇంటర్వ్యూ విధానాన్ని కూడా రద్దు చేశారు. ఈ సిలబస్ మార్పుల ప్రక్రియ జరిగి దాదాపు నాలుగేళ్లు కావడంతో మరోసారి సిలబస్‌లో మార్పులు చేసే అవకాశం ఉందంటూ అభ్యర్థుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో సిలబస్‌పై స్పష్టతనిస్తూ టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సిలబస్‌లో మార్పులకు సంబంధించి ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదని, కీలక మార్పులు చేయాల్సి వస్తే ముందుగానే అభ్యర్థులకు సమాచారం అందిస్తామని కమిషన్ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana