Kartikeya Gummakonda Makes His Directorial Debut With ‘Come Back’

D News: ‘RX 100’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ గుమ్మకొండ.. ఇప్పుడు తన కెరీర్‌లో సరికొత్త అడుగు వేశారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తున్న ఆయన.. ఈసారి ఏకంగా మెగాఫోన్ కూడా పట్టుకున్నారు. కార్తికేయ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సినిమాకు ‘కమ్‌బ్యాక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సెప్టెంబర్ 21న తన పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

బాక్సర్‌గా కార్తికేయ

‘కమ్‌బ్యాక్’ ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. గ్లింప్స్‌లో కార్తికేయ బాక్సర్‌గా కనిపించారు. మూడేళ్లుగా బాక్సింగ్ ప్రపంచానికి దూరంగా ఉన్న ఓ బాక్సర్ మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టే నేపథ్యంలో కథ సాగుతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. స్కిప్పింగ్, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కార్తికేయ కనిపించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

హీరో, డైరెక్టర్, రైటర్..

ఈ సినిమాకు కార్తికేయ హీరోగా మాత్రమే కాకుండా రచయిత, దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. తన సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆయన సతీమణి లోహితా రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఒకేసారి నటన, దర్శకత్వం, కథ బాధ్యతలను కార్తికేయ తీసుకున్నారు.

గ్లింప్స్‌లో ఆసక్తికరమైన డైలాగ్స్

“బాక్సింగ్ వరల్డ్‌లో తన పేరు వినిపించి మూడేళ్లు అవుతోంది.. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు?” అంటూ సాగే వాయిస్ ఓవర్ సినిమాకు సంబంధించిన కథపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇంతకాలం ఎక్కడున్నాడో తెలియని బాక్సర్ ఇప్పుడు తిరిగి రావడం ఒక విధంగా ‘సూసైడ్ మిషన్’లాంటిదేననే భావనను గ్లింప్స్‌లో వినిపించారు.

2027లో థియేటర్లలోకి..

విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కల్యాణ్ సూర్యప్రకాశ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతున్న ఈ సినిమా 2027లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

‘RX 100’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. ‘గ్యాంగ్ లీడర్’, ‘వలిమై’ వంటి సినిమాలతో నటుడిగానూ తనలోని మరో కోణాన్ని చూపించారు. ఇప్పుడు ‘కమ్‌బ్యాక్’తో హీరోగా రీఎంట్రీ ఇవ్వడంతో పాటు దర్శకుడిగానూ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మరి ఈ డ్యూయల్ రోల్‌లో కార్తికేయ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana