The Paradise Overseas Release Faces Last-Minute Content Delay; Second Half Still Pending

D News: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించి ఓవర్‌సీస్ కంటెంట్ విషయంలో చివరి నిమిషం పనులు కొనసాగుతున్నాయి.

సెకండాఫ్ కంటెంట్‌పై ఫోకస్

ఓవర్‌సీస్‌కు పంపాల్సిన తెలుగు కంటెంట్‌లో ఫస్ట్ హాఫ్ ఇప్పటికే లాక్ చేసి, ఎలక్ట్రానిక్ థియేటర్ లొకేషన్లకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే సెకండాఫ్‌కు సంబంధించిన ఫైనల్ కరెక్షన్స్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. దీంతో మొత్తం ప్రింట్ డెలివరీ ప్రక్రియ కాస్త ఆలస్యమవుతోంది.

సినిమా పనుల్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సోమవారం జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఆయన హాజరు కాలేకపోయినట్లు సమాచారం.

క్యూబ్‌లో లోడ్ అయ్యాక 4-5 గంటలు

సెకండాఫ్ ఫైనల్ కంటెంట్‌ను మరికొన్ని గంటల్లో క్యూబ్‌లో లోడ్ చేసే ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తోంది. కంటెంట్ అందిన తర్వాత మాస్టరింగ్, అప్‌లోడ్ పూర్తి చేయడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఓవర్‌సీస్‌లోని డిజిటల్, ఎలక్ట్రానిక్ థియేటర్లకు తెలుగు కంటెంట్ చేరనుంది.

హార్డ్‌డిస్క్ ద్వారా సినిమాను ప్రదర్శించే లొకేషన్లకు మాత్రం మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయానికి కంటెంట్ చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇతర భాషల కంటెంట్ ఎప్పుడు?

తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వెర్షన్ల కంటెంట్ గురువారం రోజున ఓవర్‌సీస్‌కు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆలస్యంగా కంటెంట్ చేరితే కొన్ని భాషల షోలు రద్దయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది.

ఇక ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘దసరా’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చివరి నిమిషం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఓవర్‌సీస్ అభిమానుల దృష్టి మొత్తం కంటెంట్ డెలివరీపైనే ఉంది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana