Shailesh Kolanu’s New Film as a Youthful Love Story.. Major Update on ‘Emo Emo Idi’!

D News: ‘హిట్’ ఫ్రాంచైజీతో క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లకు గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు పూర్తిగా కొత్త జానర్‌లోకి అడుగుపెడుతున్నారు. రక్తపాతం, మర్డర్ మిస్టరీలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్‌కు భిన్నంగా ఈసారి ఓ క్యూట్, యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ‘ఏమో ఏమో ఇది’ అనే టైటిల్ ఖరారు చేశారు.

రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన తాజా అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. 2026 అక్టోబర్ 30న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

రొమాంటిక్ లుక్‌తో ఆకట్టుకున్న శైలేష్

ఇప్పటికే విడుదలైన ‘ది ఫస్ట్ బ్రీజ్ ఆఫ్ ఏమో ఏమో ఇది’ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పటివరకు శైలేష్ కొలను నుంచి చూసిన థ్రిల్లర్ జానర్‌కు పూర్తి భిన్నంగా ఇందులో సాఫ్ట్, రొమాంటిక్ టచ్ కనిపించడంతో ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడింది. రోషన్, ప్రీతి ముకుందన్ జోడీ కూడా ఫ్రెష్‌గా కనిపిస్తుండటంతో యూత్‌లో అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఎస్, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.

By Avinash